ముస్లిం యువకునికి హిందూ కుటుంబం ఇఫ్తార్ విందు

ABN , First Publish Date - 2020-04-28T14:58:40+05:30 IST

దేశంలో ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా మరోవైపు మతసామరస్యం వెల్లివిరిసే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసోంలో ఇటివంటి ఘటన....

ముస్లిం యువకునికి హిందూ కుటుంబం ఇఫ్తార్ విందు

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా మరోవైపు మతసామరస్యం వెల్లివిరిసే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసోంలో ఇటివంటి ఘటన చోటుచేసుకుంది. మార్చి 25 నుండి దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఒక ముస్లిం యువకుడు అసోంలోని  మజులిలో చిక్కుకున్నాడు. ఇంతలో పవిత్ర ముస్లిం రంజాన్ నెల శనివారం నుండి ప్రారంభమైంది. ఈ ముస్లిం యువకుడు రంజాన్ ఉపవాసం పాటిస్తున్నాడు. అయితే ఒక హిందూ కుటుంబం ఈ యువకుడికి ఇఫ్తార్ ఏర్పాటు చేస్తోంది. ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దీనిలో హిందూ కుటుంబం మధ్య ఒక ముస్లిం యువకుడు ఆహరం తింటూ కనిపిస్తున్నాడు.  

Updated Date - 2020-04-28T14:58:40+05:30 IST