-
-
Home » Prathyekam » groom unique marriage like vihah film
-
విచిత్ర వివాహం: ఆసుపత్రిలో తాళి కట్టించుకుని...
ABN , First Publish Date - 2020-12-19T16:47:08+05:30 IST
యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా...

ప్రతాప్‌గఢ్: యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా స్టయిల్‌లో తీవ్రమైన భావోద్వోగాల మధ్య ఒక జంటకు ఆసుపత్రిలో వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే రైతు రామ్ ప్యారే కుమార్తె, నవ వధువు ఆరతికి ప్రతాప్‌గఢ్‌లోని ఒక ఆసుపత్రిలో వరుడు అవధేష్ తాళి కట్టాడు. పెళ్లికి సరిగ్గా గంట ముందు ఆరతి కింద పడిపోవడంతో ఆమె వెన్నెముక విరిగింది. ప్రస్తుతం ఆరతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆరతి, అవధేష్‌ల వివాహం డిసెంబరు 8న నిర్ణయించారు.
అయితే సరిగ్గా పెళ్లిరోజున ఆరతి మెట్లపై నుంచి జారి పడిపోయింది. ఫలితంగా ఆమె వెన్నెముక విరిగిపోయింది. దీంతో బంధువులంతా ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆమె చికిత్స పొందుతుండగానే అనుకున్న శుభముహూర్తానికే అవధేష్... ఆరతి మెడలో తాళి కట్టాడు. ఆసుపత్రే కల్యాణ వేదికగా మారగా, బంధువులు ఆ నూతన జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అవధేష్ మాట్లాడుతూ ఇప్పడు ఆరతి ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే ఆమె అత్తారింటిలో కాలు మోపనుందని తెలిపారు. ఆరతి మాట్లాడుతూ అవధేష్ తన భాగస్వామిగా అన్ని భాధ్యతలు నెరవేరుస్తున్నాడని అన్నారు.