పెళ్లి రిసెప్షన్ టూ పోలీస్ స్టేషన్..!

ABN , First Publish Date - 2020-03-24T16:22:40+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రజలు లాక్‌డౌన్ పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పెళ్లి రిసెప్షన్ నిర్వహించినందుకు...

పెళ్లి రిసెప్షన్ టూ పోలీస్ స్టేషన్..!

ఒడిషా: దేశవ్యాప్తంగా ప్రజలు లాక్‌డౌన్ పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పెళ్లి రిసెప్షన్ నిర్వహించినందుకు వరుడిని అదుపులోకి తీసుకున్న ఘటన ఒడిషా రాష్ట్రంలో వెలుగుచూసింది. కంధమల్ జిల్లాలోని నౌపాద గ్రామంలో పరమేశ్వర్ భుక్తా అనే యువకుడి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు 60 నుంచి 80 మంది దాకా గ్రామస్తులు హాజరయ్యారు.


లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో ఏడుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని ఒడిషా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రిసెప్షన్‌కు ఇంతమంది హాజరుకావడంతో వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుడినే అదుపులోకి తీసుకోవడంతో వచ్చిన బంధువులంతా కంగుతిన్నారు.

Read more