అల్పాహారంతో మొదలైన వివాదం.... వధువు సోదరునిపై వరుని దాడి, హత్య!
ABN , First Publish Date - 2020-06-18T14:01:29+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలో స్వీట్లు వడ్డించడంలో తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారితీసింది. ఈ వివాదంలో వరుడు ఆగ్రహంతో...

ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో స్వీట్లు వడ్డించడంలో తలెత్తిన వివాదం చివరికి హత్యకు దారితీసింది. ఈ వివాదంలో వరుడు ఆగ్రహంతో వధువు సోదరుడు(9)ని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో ఆ బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో వరుడు భయంతో కారులో పారిపోతూ, ముగ్గురు మహిళలను కారుతో ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే అత్‌సైని పహడ్‌పూర్ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌కు గోవింద్‌పూర్ అహ్దుల్లాపూర్ గ్రామంలో వివాహం జరిగింది. ఈ ఘటన గురించి వధువు సోదరుడు పునీత్ (19) మాట్లాడుతూ వరుడు ఊరేగింపుగా ఇక్కడకు వచ్చాడన్నారు. కొంతసేపటి తరువాత అల్పాహారం విషయంలో గొడవ జరిగిందని, ఈ నేపధ్యంలో వరుడు వధువు సోదరుని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తరువాత అక్కడి నుంచి కారులో పారిపోయే ప్రయత్నంలో ముగ్గురు మహిళలను కారుతో ఢీకొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన వరుని కోసం గాలిస్తున్నారు.