మేడపై టెన్నిస్ ఆడుకున్న అమ్మాయిలు.. సర్ప్రయిజ్ ఇచ్చిన ఫెదరర్!
ABN , First Publish Date - 2020-08-02T05:16:08+05:30 IST
ఇటలీ దేశంలో లాక్డౌన్ సమయంలో మేడపై ఇద్దరు అమ్మాయిలు టెన్నిస్ ఆడారు.

రోమ్: ఇటలీ దేశంలో లాక్డౌన్ సమయంలో మేడపై ఇద్దరు అమ్మాయిలు టెన్నిస్ ఆడారు. వీరి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయింది. దీంతో ఫేమస్ అయిన వీరిద్దరికీ 20సార్లు గ్రాండ్‌స్లామ్ సాధించిన టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పెద్ద సర్ప్రయిజ్ ఇచ్చాడు. ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోయిన అమ్మాయిలిద్దర్నీ ఓ టీవీ ఛానెల్ వీడియో కాలింగ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తోంది. ఆ సమయంలో వాళ్ల వెనగ్గా ఫెదరర్ వచ్చి హాయ్ చెప్పాడు. దీంతో ఆ అమ్మాయిల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వారితో కాసేపు ముచ్చటించిన ఫెదరర్.. మేడపై ఇద్దరమ్మాయిలతో కలిసి టెన్నిస్ కూడా ఆడాడు.