టీవీ చూస్తే జరిమానా...ముర్షిదాబాద్ జిల్లా గ్రామ కమిటీ ఫత్వా

ABN , First Publish Date - 2020-08-22T13:13:17+05:30 IST

గ్రామంలో ఎవరైనా టీవీ చూసినా, క్యారమ్ ఆడినా జరిమానా విధిస్తామని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిమ్ మైనారిటీల ప్రాబల్య గ్రామ కమిటీ సంచలన ఫత్వా జారీ చేసింది....

టీవీ చూస్తే జరిమానా...ముర్షిదాబాద్ జిల్లా గ్రామ కమిటీ ఫత్వా

ముర్షిదాబాద్ (పశ్చిమబెంగాల్): గ్రామంలో ఎవరైనా టీవీ చూసినా, క్యారమ్ ఆడినా జరిమానా విధిస్తామని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిమ్ మైనారిటీల ప్రాబల్య గ్రామ కమిటీ సంచలన ఫత్వా జారీ చేసింది. ముర్షిదాబాద్ జిల్లా గ్రామంలో ప్రజలు టీవీ చూడటం, క్యారమ్స్ ఆడటం, మద్యం, లాటరీ టికెట్లు కొనడం, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల సాయంతో మ్యూజిక్ వినడం నిషేధమని గ్రామ పెద్దల కమిటీ ప్రకటించింది. ఈ మేర గ్రామంలో ఓ బ్యానరును సామాజిక సంస్కరణల కమిటీ ఏర్పాటు చేసింది. టీవీ చూసినా, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో మ్యూజిక్ విన్నా 1000రూపాయలు, క్యారమ్స్ ఆడితే 500రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ కమిటీ హెచ్చరించింది. లాటరీ టికెట్ కొంటే 2వేల రూపాయలు, లాటరీ టికెట్ విక్రయిస్తే రూ.7వేలు, గంజాయి కొంటే రూ.7వేలు జరిమానా విధిస్తామని కమిటీ పేర్కొంది. తమ గ్రామంలో మద్యం తాగితే రూ.2వేలు జరిమానాతోపాటు 10 గుంజిళ్లు తీయిస్తామని కమిటీ హెచ్చరించింది. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.7వేలు జరిమానాతోపాటు శిరోముండనం చేస్తామని కమిటీ పెద్దలు నిర్ణయించారు.

Updated Date - 2020-08-22T13:13:17+05:30 IST