అనకొండ గూడ్స్ ట్రైన్‌ను ఎప్పుడైనా చూశారా?
ABN , First Publish Date - 2020-02-08T16:17:45+05:30 IST
ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో మూడు గూడ్సు రైళ్లను అనుసంధానించి రూపొందించిన 177 వ్యాగన్లతో కూడిన అనకొండ గూడ్సు రైలు 220 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో...

బిలాస్‌పూర్: ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో మూడు గూడ్సు రైళ్లను అనుసంధానించి రూపొందించిన 177 వ్యాగన్లతో కూడిన అనకొండ గూడ్సు రైలు 220 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించింది. దేశంలో రైల్వేశాఖ తొలిసారిగా ఇటువంటి ప్రయత్నం చేసింది. ఈ అనకొండ గూడ్సు రైలు రెండు కిలోమీటర్ల పొడవు కలిగివుంది. భిలాయ్ లోకో షెడ్ నుంచి మధ్యాహ్నం 2,55కు బయలు దేరిన ఈ గూడ్సు రైలు సాయంత్రం 6.40కి బిలాస్‌పూర్ మీదుగా వెళ్లి, రాత్రి 10.50కి కోర్బా చేరుకుంది. దీనికి ముందు 2019 మే నెలలో ఈ అనకొండ గూడ్సును నడిపారు. ఆ సమయంలో ఈ గూడ్సు రైలు ఇదే దూరాన్ని 7. 30 గంటల్లో పూర్తి చేసింది. మూడు గూడ్సు రైళ్లను అనుసంధానించేందుకు మూడు ఎలక్ట్రిక్ ఇంజన్లు అమర్చారు. మొదటి ఇంజిన్‌లో లోకో పైలెట్ ఉండగా, మిగిలిన రెండు ఇంజిన్లు విద్యుత్ ఆధారంగా నడిచాయి.