కరోనా సూపర్ హీరో: రోజూ 8 కిలోమీటర్లు నడిచి...

ABN , First Publish Date - 2020-04-25T15:45:44+05:30 IST

ఇతరుల అవసరాలను తీర్చడానికి పాటుపడేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీరిలో ఇంగ్లాండ్ కు చెందిన జేన్ పావల్స్ అనే టీచర్ ఒకరు. ఆయన పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆహారం అందిస్తుంటారు.

కరోనా సూపర్ హీరో: రోజూ 8 కిలోమీటర్లు నడిచి...

లండన్: ఇతరుల అవసరాలను తీర్చడానికి పాటుపడేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీరిలో ఇంగ్లాండ్ కు చెందిన జేన్ పావల్స్ అనే టీచర్ ఒకరు. ఆయన పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆహారం అందిస్తుంటారు. కరోనా వల్ల లాక్డౌన్ సమస్య ఎదురైనప్పటి నుండి పాఠశాల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం అతను ప్రతి రోజూ 8 కిలోమీటర్లకు పైగా దూరం నడుస్తాడు. జేన్ గతంలో మిలటరీలో ఉద్యోగం చేసేవాడు. ఆహారం అందించే సమయంలో విద్యార్థుల చేత సామాజిక దూరాన్ని పాటింపజేస్తాడు. జేన్ తన పాఠశాలలో 34 శాతం మంది పిల్లలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారని తెలిపారు. వారికి పాఠశాల తరపున ఆహారం ఇస్తారు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ పని చేస్తున్నారు. అయితే జేన్ కాలినడకన మాత్రమే వెళ్తాడు.  

Updated Date - 2020-04-25T15:45:44+05:30 IST