ట్యాబ్లెట్లను వెనక్కి తెప్పించిన కంపెనీ.. కారణం తెలిసి అందరూ షాక్!

ABN , First Publish Date - 2020-12-12T01:41:35+05:30 IST

‘ప్రొడక్ట్ మిక్స్-అప్’ కారణంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏవీకేర్ 100 ఎంజీ సిల్డెనాఫిల్, 100 ఎంపీ ట్రాజోడోన్ ట్యాబ్లెట్లను స్వచ్ఛందంగా

ట్యాబ్లెట్లను వెనక్కి తెప్పించిన కంపెనీ.. కారణం తెలిసి అందరూ షాక్!

పులస్కీ (అమెరికా): ‘ప్రొడక్ట్ మిక్స్-అప్’ కారణంగా అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏవీకేర్ 100 ఎంజీ సిల్డెనాఫిల్, 100 ఎంపీ ట్రాజోడోన్ ట్యాబ్లెట్లను స్వచ్ఛందంగా వెనక్కి తెప్పించింది. వాటిని తాము ఎందుకు వెనక్కి తెప్పించింది అది బయటపెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ట్యాబ్లెట్లను మూడవ పార్టీ విక్రేత ప్యాక్ చేసినప్పుడు అనుకోకుండా కలిసిపోయాయని కంపెనీ తెలిపింది. అయితే, ఆ మందులు ఎందులో కలిసిపోయాయో తెలిసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 


సిల్డెనాఫిల్ అనేది వయాగ్రా మాత్రలలో ఉపయోగించే కీలక పదార్థాలలో ఒకటి. అంగస్తంభన సమస్యల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు. ట్రజోడోన్‌ను నిస్పృహ రుగ్మతను నయం చేసేందుకు వాడతారు. సిల్డెనాఫిల్‌ను తెలియకుండా పొరపాటున వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవి మరింత ముప్పును కలిగిస్తాయి. అంటే రక్తపోటు ప్రమాదకరస్థాయికి పడిపోవడం వంటివి జరగొచ్చు. 


ఇక, ట్రజోడోన్‌ను కూడా తెలియక తీసుకుంటే మగత, మైకం కమ్మినట్టు ఉండడం, మలబద్ధకం, చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఏవీకేర్ వెంటనే ట్యాబ్లెట్లను వెనక్కి తెప్పించింది. వాటి కాలపరిమితి 2022తో ముగియనున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ సకాలంలో స్పందించి మందులను వెనక్కి తెప్పించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-12-12T01:41:35+05:30 IST