ఆవు మూత్రం తాగితే కరోనా రాదు...బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-18T13:31:49+05:30 IST

కరోనా వైరస్ రాకుండా నిరోధించేందుకు ప్రజలు ఆవు మూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సంచలన సూచన చేశారు.....

ఆవు మూత్రం తాగితే కరోనా రాదు...బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): కరోనా వైరస్ రాకుండా నిరోధించేందుకు ప్రజలు ఆవు మూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సంచలన సూచన చేశారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రోగనిరోధక శక్తని పెంచడానికి గోమూత్రం తాగాలని దిలీప్ ఘోష్ కోరారు. దుర్గాపూర్ నగరంలో జరిగిన సమావేశంలో దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఆవు మూత్రం తాగాలని సలహా ఇచ్చారు. ‘‘నేను ఆవుల గురించి మాట్లాడితే చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆవు విలువను గాడిదలు ఎప్పటికీ అర్థం చేసుకోవు. ఇది భారతదేశం, శ్రీకృష్ణుడు జన్మించిన భూమి ... ఇక్కడ మేం ఆవులను పూజిస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి మాకు ఆవు మూత్రం ఉంది. మద్యం తాగే వారు, ఆవు విలువను ఎలా అర్థం చేసుకుంటారు’’అని మిస్టర్ ఘోష్ వీడియోలో పేర్కొన్నారు.లాక్డౌన్ ఆంక్షలు సడలించినప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్ రాష్ట్రంలోని మద్యం దుకాణాల బయట ఉన్న పొడవైన క్యూల గురించి మాట్లాడారు.దిలీప్ ఘోష్ ఆవులపై గతంలోనూ వివాదాస్పద ప్రకటన చేశారు.  2019 నవంబరులో ఘోష్ ఆవు పాలలో బంగారం ఉందని వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. ఈ సంవత్సరం మే ప్రారంభంలో, ఘోష్ ఆవు మూత్రాన్ని తాగడంలో ఎటువంటి హాని లేదని చెప్పారు.బెంగాల్‌లోని తన సొంత పార్టీ నాయకుల నుంచి దిలీప్ ఘోష్ విమర్శలు ఎదుర్కొన్నారు.  ఈ వ్యాఖ్యలను అశాస్త్రీయంగా కొందరు అభివర్ణించారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆవు మూత్రం పంపిణీ చేస్తున్న మితవాద గ్రూపుల సభ్యులపై కేసులు కూడా నమోదు చేసింది.

Updated Date - 2020-07-18T13:31:49+05:30 IST