పాత టీవీకి పది లక్షలు ఇస్తారట!

ABN , First Publish Date - 2020-10-03T23:25:32+05:30 IST

ఐదారు దశాబ్దాల క్రితం టీవీలు, ఫోన్లు, రేడియోలు, కెమెరాలు, కుట్టుమిషన్లకు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. వాటి కోసం ..

పాత టీవీకి పది లక్షలు ఇస్తారట!

ఐదారు దశాబ్దాల క్రితం టీవీలు, ఫోన్లు, రేడియోలు, కెమెరాలు, కుట్టుమిషన్లకు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. వాటి కోసం తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలు జల్లెడ పట్టేస్తున్నాయి కొన్ని ముఠాలు. లక్షలు ఇచ్చి కొనడానికి రెడీ అవుతున్నాయి. రెడ్ మెర్క్యూరీ విలువైన మూలకం వాటిలో ఉందన్న ప్రచారమే దీనికి కారణం. స్టోర్ రూమ్‌ల్లోకి, అటకల మీదకు ఎప్పుడో చేరిపోయిన పాత టీవీలు, రేడియోలు ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. 1960,70 నాటి రేడియో, టీవీ, ల్యాండ్ ఫోన్లు, కెమెరాలు, కుట్టు మిషన్ల తయారీలో రెడ్ మెర్క్యూరీని ఉపయోగించే వారని, అన్వయుధాల తయారీకిది అవసరం అవుతోందని ఐదారు, నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెడ్ మెర్క్యూరీ అనే పదం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2020-10-03T23:25:32+05:30 IST