-
-
Home » Prathyekam » doctor wakes up from coma to find she had given birth to twins
-
కోమాలోకి కరోనా పేషెంట్.. కళ్లు తెరిచేసరికి కవలల తల్లి!
ABN , First Publish Date - 2020-11-21T23:54:26+05:30 IST
కరోనాతో కోమాలోకి వెళ్లిన ఓ డాక్టర్.. కళ్లు తెరిచేసరికి తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన యునైటెడ కింగ్‌డమ్‌లో వెలుగుచూసింది.

లండన్: కరోనాతో కోమాలోకి వెళ్లిన ఓ డాక్టర్.. కళ్లు తెరిచేసరికి తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన యునైటెడ కింగ్‌డమ్‌లో వెలుగుచూసింది. ఇక్కడ ఓ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ పర్‌పెచ్యువల్ ఉకేకు కరోనా సోకింది. అప్పటికే గర్భవతి అయిన ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో ఆమెను వైద్య విధానాల ద్వారా కోమాలోకి పంపించిన డాక్టర్లు.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇలా ఏప్రిల్ నెలలో కోమాలోకి వెళ్లిన ఉకే.. ఇటీవలే కళ్లు తెరిచారు. ఎత్తుగా ఉండాల్సిన గర్భం లేకపోవడంతో ఆమె చాలా ఆందోళన చెందింది. తనకు గర్భస్రావం అయిందేమో అని భయపడిపోయింది. అయితే ఆమెకు ధైర్యం చెప్పిన డాక్టర్లు అసలు విషయం చెప్పారు.
ఒకవేళ ఉకే కోలుకోవడం ఆలస్యమైతే కడుపులో శిశువులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. జూలై నెలలో ఆమె డెలివరీ ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆలోచించిన డాక్టర్లు చాలా ముందుగానే సిజేరియ్ ద్వారా 26 వారాలకే ఆమెకు డెలివరీ చేశారు. కోమా నుంచి తేరుకుని ఆందోళన చెందుతున్న ఉకేకు విషయం చెప్పి.. ఇద్దరు కవలలను చూపించారు. వారిద్దరినీ చూసిన ఉకే సంతోషానికి హద్దుల్లేవు. ఇది నిజంగా ఓ అద్భుతమని చెప్పి సంతోషంతో కన్నీరు పెట్టుకుంటోందామె.
