ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన డాక్టర్... ఫోటో వైరల్

ABN , First Publish Date - 2020-04-01T12:26:43+05:30 IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను ఫణంగాపెట్టి ఆసుపత్రులలో...

ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన డాక్టర్... ఫోటో వైరల్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకర  వాతావరణం నెలకొంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను ఫణంగాపెట్టి ఆసుపత్రులలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఒక దృశ్యం అందిరినీ ఆకట్టుకుంటోంది. భోపాల్ కు చెందిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ దేహరియా చాలా రోజులుగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. డాక్టర్ సుధీర్ ఐదు రోజుల డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి, తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా డాక్టర్ సుధీర్ ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. డాక్టర్ సుధీర్ దేహరియా ఐదు రోజుల తరువాత ఇంటికి వచ్చి, ఇంటి బయటనే  కూర్చుని టీ తాగారు. బయటి నుండే తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. 


Updated Date - 2020-04-01T12:26:43+05:30 IST