మధుమేహులూ.. కరోనాపై భయాందోళనలు వద్దు

ABN , First Publish Date - 2020-04-12T07:17:17+05:30 IST

మధుమేహం, రక్తపోటు, హైపో థైరాయిడ్‌ ఇవన్నీ ఉన్న ఓ 51 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి అతిత్వరగా కోలుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అగర్వాల్‌...

మధుమేహులూ.. కరోనాపై భయాందోళనలు వద్దు

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: మధుమేహం, రక్తపోటు, హైపో థైరాయిడ్‌ ఇవన్నీ ఉన్న ఓ 51 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి అతిత్వరగా కోలుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అగర్వాల్‌ అనే వృద్ధుడు ఆత్మస్థైర్యంతో కరోనాను జయించి చూపించారు. రకరకాల ఆరోగ్య సమస్యలున్నా .. నగరంలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో మంచి చికిత్స అందడంతో తాను కోలుకోగలిగానని ఆయన చెప్పారు. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉండటం బాగా కలిసొచ్చిందన్నారు. మలేరియా ఔషధాలు ప్రభావవంతంగా పనిచేయడంతో ఆస్పత్రిలో చేరిన 8 రోజుల్లోనే నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-12T07:17:17+05:30 IST