-
-
Home » Prathyekam » delhi police will soon get corona vaccine personals will get information on sms
-
ఢిల్లీ పోలీసులకు త్వరలో కరోనా వ్యాక్సిన్... ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం!
ABN , First Publish Date - 2020-12-27T13:09:18+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలోని పోలీసులకు త్వరలో కరోనా టీకాలు వేయనున్నారు. దీనికి సంబంధించిన...

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని పోలీసులకు త్వరలో కరోనా టీకాలు వేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ వారికి ఎస్ఎంఎస్ రూపంలో పంపించనుంది. ఈ ప్రక్రియ గురించి నోడల్ అధికారి ముక్తేష్ చంద్ర మాట్లాడుతూ ఢిల్లీలోని పోలీసులందరికీ త్వరలోనే టీకాలు వేసే కార్యక్రమం మొదలు కానుందని తెలిపారు. అయితే ఎవరికి ఎప్పుడు టీకా వేసేదీ... వారివారి మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయనున్నారన్నారు.
అయితే పోలీసులంతా ఇందుకోసం ముందుగా ఇంట్రాడీపీ సిస్టమ్‌లోని పీఐఎస్ సిస్టంలో తన ఫోను నంబరు అప్ డేట్ చేయించుకోవాలన్నారు. ఈ ప్రక్రియను అన్ని జిల్లాల పోలీసులు జనవరి 3 లోగా పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఢిల్లీలోని ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు. ఢిల్లీలో కరోనా బారిన పడినవారిలో పోలీసులు, హెల్త్ వర్కర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే వారికి ముందుగా టీకా ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.