హత్య కేసులో బెయిల్.. ‘ఆరోగ్య సేతు’ ఇన్స్టాల్కు కోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2020-05-18T01:41:35+05:30 IST
ఓ హత్యకేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు అతడికి ఓ ఆదేశం ఇచ్చింది. అదేంటంటే...

న్యూఢిల్లీ: ఓ హత్యకేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు అతడికి ఓ ఆదేశం ఇచ్చింది. అదేంటంటే మొబైల్ ఫోన్లో ఆరోగ్యసేతు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని సూచించింది. ఈ ఆదేశం కొంత ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ కుమార్ కశ్యప్ ఈ ఆదేశం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. రవి ధికా అనే వ్యక్తిని హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకోవడానికి మరెవరూలేరని, తాను దగ్గరుండి చూసుకోవాలని, అందుకోసం బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రవి కోర్డును కోరాడు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అనేక షరతులతో బెయిల్ మంజూరు చేశారు. అయితే మొబైల్ ఫోన్లో ఆరోగ్యసేతు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని, జీపీఎస్, బ్లూటూత్‌లను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోమని సూచించారు.