సామాజిక దూరం పాటిస్తూ, ఏకంకానున్న‌‌ ఒలింపియ‌న్ ఆర్చ‌ర్ల జంట‌

ABN , First Publish Date - 2020-06-22T17:09:34+05:30 IST

జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ప్ర‌ముఖ ఒలింపియన్ ఆర్చర్ దీపిక త‌న తోటి ఒలింపియన్ ఆర్చర్ అతనుదాస్‌ను ఈనెల 30న వివాహం చేసుకోనున్నారు. వివాహ వేడుక‌లో భాగంగా కోల్‌క‌తాలోని అతను...

సామాజిక దూరం పాటిస్తూ, ఏకంకానున్న‌‌ ఒలింపియ‌న్ ఆర్చ‌ర్ల జంట‌

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ప్ర‌ముఖ ఒలింపియన్ ఆర్చర్ దీపిక త‌న తోటి ఒలింపియన్ ఆర్చర్ అతనుదాస్‌ను ఈనెల 30న వివాహం చేసుకోనున్నారు. వివాహ వేడుక‌లో భాగంగా కోల్‌క‌తాలోని అతను దాస్ నివాసంలో తిలక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బంధువులు, ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. కాగా వీరి వివాహం ప్ర‌త్యేక రీతిలో రాంచీలో జ‌ర‌గ‌నుంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ వివాహం నిర్వ‌హించ‌నున్నారు. అతిథులకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వనున్నారు. అలాగే విందు కోసం ఏర్పాటు చేసే డైనింగ్ టేబుళ్ల‌ను మూడేసి అడుగుల దూరంలో ఏర్పాటు చేయ‌న్నారు. నూత‌న దంప‌తుల‌ను అతిథులు దూరం నుంచే ఆశీర్వ‌దించేందుకు ప్ర‌త్యేక ఏర్పా‌ట్లు చేయ‌నున్నారు. అతిథులు ఏవిధ‌మైన బ‌హుమ‌తుల‌ను ఇవ్వాల‌నుకున్నా, వేదిక స‌మీపంలో ఏర్పాటు చేసే పెద్ద బాక్సులో వేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-06-22T17:09:34+05:30 IST