తల్లి పనిమనిషి.. తండ్రి దర్జీ.. 12వ తరగతి ఎగ్జామ్స్‌లో కుమార్తె టాపర్!

ABN , First Publish Date - 2020-07-20T03:07:20+05:30 IST

జార్ఖండ్ 12వ తరగతి పరీక్షల్లో ఓ అమ్మాయి దుమ్మురేపింది. రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. బాలిక స్టేట్ ఫస్ట్ రావడం

తల్లి పనిమనిషి.. తండ్రి దర్జీ.. 12వ తరగతి ఎగ్జామ్స్‌లో కుమార్తె టాపర్!

రాంచీ: జార్ఖండ్ 12వ తరగతి పరీక్షల్లో ఓ అమ్మాయి దుమ్మురేపింది. రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. బాలిక స్టేట్ ఫస్ట్ రావడంలో పెద్దగా విశేషం లేదు కానీ, ఆమె తల్లి ఓ పనిమనిషి, తండ్రి దర్జీ కావడమే విశేషం. ఆ బాలిక పేరు నిందిత హరిపాల్. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ నిర్వహించిన 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన నందిత భవిష్యత్తులో జర్నలిస్టు కావడమే తన ధ్యేయమని పేర్కొంది. విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని, ఫస్ట్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని పేర్కొన్న నందిత జంషెడ్‌పూర్ మహిళా కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో చదువుతోంది. 


తాను టాపర్‌గా నిలవడం వెనక ఉన్న కారణాన్ని నందిత వివరిస్తూ.. ‘‘నేను క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యే దానిని. స్టడీ షెడ్యూల్ రూపొందించుకుని ఇంట్లోనే చదివేదానిని. అలాగే, కోచింగ్ క్లాసులకు కూడా వెళ్లేదానిని’’ అని వివరించింది. తన చదువు విషయంలో తల్లిదండ్రులు అన్ని వేళలా సహకరించారని, ఆర్థిక సమస్యలు తనపై ప్రభావం చూడకుండా జాగ్రత్త పడ్డారని తెలిపింది. ట్యూషన్‌పైనే విజయం ఆధారపడి ఉంటుందన్న విషయంలో నిజం లేదని తెలిపింది. రెగ్యులర్‌గా క్లాస్‌లకు హాజరైతే సరిపోతుందని వివరించింది. ఆమె పై చదువుల విషయంలో రాజీపడబోనని నందిత తండ్రి రాజేశ్ హరిపాల్ తెలిపారు.  

Updated Date - 2020-07-20T03:07:20+05:30 IST