-
-
Home » Prathyekam » Daughter gave a huge happiness to her father who is suffering with Corona
-
కరోనాతో బాధపడుతున్న తండ్రికి కూతురిచ్చిన ఓదార్పు చూస్తే..
ABN , First Publish Date - 2020-03-24T18:24:24+05:30 IST
ఇజ్రాయెల్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం కరోనా. ఈ వైరస్ బారిన పడి ఎన్నో దేశలు విలవిల్లాడుతున్నాయి.

ఇజ్రాయెల్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం కరోనా. ఈ వైరస్ బారిన పడి ఎన్నో దేశలు విలవిల్లాడుతున్నాయి. వాటిలో ఇజ్రాయెల్ ఒకటి. అక్కడి టెల్ అవీవ్‌లో ఓ అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతున్న తండ్రికి ఓ కూతురిచ్చిన ఓదార్పు చూపరులను కన్నీళ్లు పెట్టించింది.
ఒపెరా గాయని ఇరిట్ స్టార్క్ తండ్రి మైఖేల్ స్టార్క్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఆయన అపార్టుమెంటు బాల్కనీలో ఉంటే.. ఇరిట్ ఆయనకు వినిపించేలా బయట నుంచి పాట పాడుతూ తండ్రికి ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నం ఫలించింది. కూతురి పాట విన్న మైఖేల్ తన బాధనంతా మరచిపోయి చిరునవ్వు చిందిస్తూ చప్పట్లు కొట్టడం విశేషం. ఈ సంఘటనను చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇరిట్‌ని అభినందించారు.