ఆవుపేడ చిప్ రేడియేషన్ నుంచి రక్షణ ఇస్తోంది...

ABN , First Publish Date - 2020-10-13T14:37:15+05:30 IST

ఆవుపేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఆవుపేడ చిప్ రేడియేషన్ నుంచి రక్షణ ఇస్తోంది...

రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చీఫ్ వ్యాఖ్యలు

‘గౌసత్వా కవచ్’ ఆవిష్కరణ

న్యూఢిల్లీ : ఆవుపేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవుపేడకు రేడియేషన్ ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా చెప్పారు. ఆవుపేడతో తయారైన చిప్ ను ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్ ను నివారించడానికి ఈ ఆవుపేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. 


ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవుపేడ చిప్ ను ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి  ‘గౌసత్వా కవచ్’అని పేరు పెట్టారు.రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్‌ను ఫోన్‌లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు.


‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది.’’ అని కతిరియా వివరించారు. 

Updated Date - 2020-10-13T14:37:15+05:30 IST