కరోనా కల్లోలంతో పాక్ వధువు, భారత వరుడి కళ్యాణం ఆలస్యం

ABN , First Publish Date - 2020-06-25T15:48:19+05:30 IST

కరోనా కల్లోలం వల్ల కళ్యాణాలు సైతం ఆలస్యమవు తున్నాయి. పాకిస్థాన్ వధువుకు, భారత వరుడికి జరగాల్సిన వివాహం కరోనా లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిందని...

కరోనా కల్లోలంతో పాక్ వధువు, భారత వరుడి కళ్యాణం ఆలస్యం

వీసా జారీకి మోదీకి భారత వరుడి విన్నపం

న్యూఢిల్లీ : కరోనా కల్లోలం వల్ల కళ్యాణాలు సైతం ఆలస్యమవు తున్నాయి. పాకిస్థాన్ వధువుకు, భారత వరుడికి జరగాల్సిన వివాహం కరోనా లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన ఘటన జలంధర్ లో వెలుగుచూసింది. ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని తాము వివాహం చేసుకునేందుకు వీలుగా వీసా జారీ చేయాలని వధూవరులు సుమైలా, కమల్ కళ్యాణ్‌లు విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని జలంధర్ నగరానికి చెందిన కమల్ కళ్యాణ్ కు పాకిస్థాన్ దేశానికి చెందిన సుమైలాకు పెళ్లి చేయాలని 2018 జనవరి 26వతేదీన ఇరు కుటుంబాలు నిర్ణయించుకొని వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థం కూడా చేశారు. పాకిస్థాన్ దేశంలో నివాసముంటున్న తన సోదరి ఆసియా కుమార్తె సుమైలాను తన కుమారుడు కమల్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించానని వరుడి తండ్రి ఓంప్రకాష్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలలో వీరి వివాహం జరగాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అయింది. తాము వివాహం చేసుకునేందుకు వీలుగా తమకు కల్యాణ్ వీసాలు జారీ చేయాలని వధూవరులు సుమైలా, కమల్ కళ్యాణ్‌లు ప్రధానికి విన్నవించారు. ప్రధాని మోదీ స్పందించి వధూవరులతోపాటు వారి కుటుంబసభ్యులకు వీసాలు మంజూరు చేసి, సరిహద్దులు తెరుస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-06-25T15:48:19+05:30 IST