క‌రోనాను త‌రిమి కొడుతున్న గ్రామ‌స్తులు

ABN , First Publish Date - 2020-05-11T14:28:45+05:30 IST

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ ముప్పు అంత‌కంత‌కూ పెరుగుతుండగా, ఆరు ఈశాన్య రాష్ట్రాల్లోని ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని గ్రామీణ జ‌నం క‌రోనాని ఓడించ‌డంలో...

క‌రోనాను త‌రిమి కొడుతున్న గ్రామ‌స్తులు

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ ముప్పు అంత‌కంత‌కూ పెరుగుతుండగా, ఆరు ఈశాన్య రాష్ట్రాల్లోని ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని గ్రామీణ జ‌నం క‌రోనాని ఓడించ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. వీరు క‌ఠినమైన నియమాలను అవ‌లంబించ‌డంతో క‌రోనా ముప్పు నుంచి త‌ప్పించుకుంటున్నారు.  నాగాలాండ్‌లోని సిక్కింలో ఒక్క కేసు కూడా న‌మోదుకాలేదు. మణిపూర్‌లో రెండు, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంలో ఒక్కో కేసు న‌మోదు కాగా, ఆ రోగులందరూ పూర్తిగా కోలుకోవ‌డం విశేషం. ఈ నేప‌ధ్యంలో మిజోరంను కరోనా రహిత ప్రాంతంగా ప్రకటించారు. మేఘాలయలో మొత్తం 13 క‌రోనా కేసులు న‌మోదు‌కాగా, వీరిలో 10 మంది కోలుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు తగ్గడం వెనుక సహజ, భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా బయటి వ్యక్తులు ఆ ప్రాంతాల‌కు వెళ్ల‌డం పూర్తిగా ఆగిపోయింది. మ‌రోవైపు అక్క‌డ‌కు వ‌చ్చిన‌వారిని క్వారంటైన్‌లో ఉంచారు. 

Updated Date - 2020-05-11T14:28:45+05:30 IST