గేదె మాంసంతో సరిపెట్టుకుంటున్న సింహాలు, పులులు
ABN , First Publish Date - 2020-04-28T17:10:55+05:30 IST
కరోనా వైరస్ లాక్డౌన్ జంతువులపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలోని జూపార్కులో సింహాలు, పులులకు ఆహరం కొరత ఏర్పడుతోంది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాక్డౌన్ జంతువులపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలోని జూపార్కులో సింహాలు, పులులకు ఆహరం కొరత ఏర్పడుతోంది. లాక్డౌన్ కారణంగా మాంసం అందుబాటులో లేదు. ఇంతవరకు వాటికి ఘాజిపూర్ స్లాటర్ హౌస్ నుండి మాంసం వచ్చేది. లాక్డౌన్ కారణంగా దానిని మూసివేశారు. ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలలో 20 పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి. వాటికి ఆహారాన్ని ఇప్పుడు జంతుప్రదర్శనశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం గేదె మాంసాన్ని వాటికి అందిస్తున్నారు. ఇందుకు జూపార్క్ అధికారులు అనుమతి తీసుకున్నారు. దీనిపై జూ అధికారి మాట్లాడుతూ సింహాలకు, పులులకు.. గేదె మాంసం ఇవ్వడం వలన ప్రోటీన్ లోపం ఏర్పడవచ్చన్నారు. గేదెలను సమీప గ్రామాల నుండి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ 20 జంతువులకు రోజుకు 300 కిలోల మాంసం అవసరమని చెప్పారు. గేదెలను కోసేటప్పుడు పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.