కరోనా భయాల మధ్య కోటి రూపాయల లాటరీ తగలడంతో...

ABN , First Publish Date - 2020-03-23T16:47:36+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపధ్యంలో పలువురు పట్టణాల నుంచి తమ పల్లెలకు తరలిపోతున్నారు. ఇదేవిధంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి...

కరోనా భయాల మధ్య కోటి రూపాయల లాటరీ తగలడంతో...

ముర్షిదాబాద్: దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపధ్యంలో పలువురు పట్టణాల నుంచి తమ పల్లెలకు తరలిపోతున్నారు. ఇదేవిధంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన గ్రామానికి చేరుకున్నంతలో అతను ఊహించని విధంగా జరిగింది. ఉద్యోగం వదిలేసి, నిరాశగా గ్రామానికి చేరుకున్న ఆ వ్యక్తికి కోటి రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరోనా భయంతో ఇజారుల్ షేఖ్ తన గ్రామానికి తిరిగివచ్చాడు. భవిష్యత్‌పై అతనిలో భయం నెలకొంది. అయితే కేరళలో ఉండగా అతను ఒక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన ఇజారుల్ కేరళలో ఉద్యోగం చేసేవాడు. అయితే కేరళలో కరోనా ప్రభలుతున్న నేపధ్యంలో అతను పశ్చిమ బెంగాల్‌లోని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఇజారుల్ కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌కు కోటి రూపాయల ప్రైజ్‌మనీ దక్కిందని అతనికి తెలిసింది. దీంతో ఇజారుల్ ఆనందంతో చిందులేస్తున్నాడు. 

Updated Date - 2020-03-23T16:47:36+05:30 IST