కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు... విచిత్ర విధానాలు!

ABN , First Publish Date - 2020-03-02T12:20:17+05:30 IST

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ వణికిస్తోంది. అలాగే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. చెైనాలోని ఉహాన్ నుంచి ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచమంతటికీ...

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు... విచిత్ర విధానాలు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ వణికిస్తోంది. అలాగే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. చెైనాలోని ఉహాన్ నుంచి ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచమంతటికీ పాకిపోతోంది.


ఈ నేపధ్యంలో కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు జనం పలు విచిత్ర విధానాలు అవలంబిస్తున్నారు. చాలామంది ముఖానికి మాస్కులు ధరిస్తుండగా, కొందరు శరీరమంతటికీ టెంటు వేసుకుని నడుచుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు అనునిత్యం హెల్మెట్ ధరిస్తున్నారు. ఇలా విచిత్రమైన రీతుల్లో జనం మధ్య సంచరిస్తున్నారు. 

Updated Date - 2020-03-02T12:20:17+05:30 IST