కళ్లజోడు వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త!
ABN , First Publish Date - 2020-09-01T23:30:14+05:30 IST
కళ్లజోడు వాడుతున్నారా?. అయితే కరోనా వేళ జాగ్రత్త ఉండాల్సిందే. ఎందుకంటే కళ్లద్దంపై కరోనా వైరస్ తొమ్మిది నుంచి 15 రోజుల వరకూ..

కళ్లజోడు వాడుతున్నారా?. అయితే కరోనా వేళ జాగ్రత్త ఉండాల్సిందే. ఎందుకంటే కళ్లద్దంపై కరోనా వైరస్ తొమ్మిది నుంచి 15 రోజుల వరకూ బతికే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కళ్ల జోడును జాగ్రత్తగా శానిటైజ్ చేసుకోవాలని డాక్టర్ రవీందర్ అంటున్నారు. ‘‘కరోనా సోకకుండా ఉండాలంటే కళ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే వాడే కళ్లజోడును కూడా శానిటైజ్ చేసుకోవాలి. కళ్లజోళ్లు వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోళ్లు వాడేటప్పుడు మధ్యలో ఉన్న అద్దాలను పట్టుకోకూడదు. సైడ్ వాల్స్‌ను పట్టుకొని కళ్లకు పెట్టుకోవాలి. కళ్లజోడును వేడి నీళ్లతో కడుక్కోవాలి.’’ అని డాక్టర్ రవీందర్ తెలిపారు.