-
-
Home » Prathyekam » corona virus chhapara youth missing meets many years with family
-
కరోనా మహాత్మ్యం.... కొడుకు జాడతో ఆ కుటుంబంలో ఆనందం!
ABN , First Publish Date - 2020-04-07T13:51:12+05:30 IST
కరోనా వైరస్ సంక్రమణ దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. అయితే కరోనా కారణంగా చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ ఘటన బీహార్లోని చాప్రా పరిధిలోగల...

చాప్రా: కరోనా వైరస్ సంక్రమణ దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. అయితే కరోనా కారణంగా చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ ఘటన బీహార్లోని చాప్రా పరిధిలోగల మిత్రసేన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో నివసిస్తున్న బాబులాల్ దాస్ కుమారుడు అజయ్ కుమార్ అలియాస్ వివేక్ దాస్ ఏడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. రెండుమూడేళ్లయినా అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో, అజయ్ ఇక లేడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక యువకుడిని వెంటబెట్టుకుని భెల్డి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడి అధికారి అందించిన వివరాల ప్రకారం పోలీసులు మిత్రసేన్ గ్రామానికి చేరుకున్నారు. బాబులాల్ దాస్ కుటుంబ సభ్యులకు అజయ్ ని చూపించారు. దీనితో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అజయ్ తన ఇంటి నుండి అదృశ్యమైన తరువాత బారాబంకి లో ఉన్నాడని యుపి పోలీసులు తెలిపారు. అక్కడ ఒక క్రిమినల్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడన్నారు.. కరోనా ఇన్ఫెక్షన్ దృష్ట్యా అజయ్ కుమార్ దాస్ తో సహా కొంతమంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో యుపి పోలీసులు అతనిని మిత్రసేన్ గ్రామానికి తీసుకెళ్ళి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.