కరోనాను కర్కటితో పోలుస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-03-23T21:10:19+05:30 IST

ప్రపంచ మానవాళిపై విరుచుకుపడుతూ మారణహోమం సాగిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్-19)ను పురాణాల్లోని ‘కర్కటి’ రాక్షసితో పోలుస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రితం హిమాలయాలకు ఉత్తరాన మానవాళిపై విరుచుకుపడిన 'కర్కటి' అనే మహమ్మారే ఇప్పుడు 'కరోనా' పేరుతో మానవాళిని కబలిస్తోందని అంటున్నారు.

కరోనాను కర్కటితో పోలుస్తున్న నెటిజన్లు!

ప్రపంచ మానవాళిపై విరుచుకుపడుతూ మారణహోమం సాగిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్-19)ను పురాణాల్లోని ‘కర్కటి’ రాక్షసితో పోలుస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రితం హిమాలయాలకు ఉత్తరాన మానవాళిపై విరుచుకుపడిన 'కర్కటి' అనే మహమ్మారే ఇప్పుడు 'కరోనా' పేరుతో మానవాళిని కబలిస్తోందని అంటున్నారు. శ్రీకాళహస్తి శుక్రబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామీజీ కొన్ని దశాబ్దాల క్రితం రాసిన ‘యోగ వాశిష్టం’ (యోగ రత్నాకరం, వశిష్ట గీత)లో పుస్తకంలో ఉన్న ‘కర్కట్యుపాఖ్యానం’ ప్రస్తావిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది.


యోగ వాశిష్టంలోని 'కర్కట్యుపాఖ్యానం'లో  కర్కటి అనే మహమ్మారి బ్రహ్మదేవుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసిందని, ఈ కర్కటి కనిపించిన జీవజాతులను చంపుకు తినే స్వభావం ఉన్నదని.. అయితే, తేలిగ్గా ఒక నీడిల్‌గా మారి ప్రజలను ఎడాపెడా తినాలనే కోరికతో ఘోర తపస్సు చేసిందని అందులో ఉంది. ఆ ఘోర తపస్సుకు బ్రహ్మ దేవుడు మెచ్చి వరమిచ్చాడని.. దాంతో అది మంచి వాళ్లు, చెడ్డ వాళ్లని కూడా చూడకుండా కనపడిన మనుషులపై విరుచుకుపడి రక్తమాంసాలు జుర్రుకుంటోందని యోగ వాశిష్టంలో ఉంది. దాన్ని చూపుతూ అదే ఇప్పుడు కరోనాగా మారిందని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కరోనా వైరస్ గురించి ఎప్పుడో చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. శాస్త్రవేత్తల ప్రయోగం సత్ఫలితాలిచ్చే వరకూ ఎవరికి వారు తగు జాగ్రత్తలు పాటించడమే మంచిది.







Updated Date - 2020-03-23T21:10:19+05:30 IST