‘కరోనా కిల్లర్’ పెట్టె
ABN , First Publish Date - 2020-04-28T06:20:26+05:30 IST
ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ‘కరోనా కిల్లర్ బాక్స్’ను రూపొందించారు. వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పీపీఈ), మాస్క్‌లు, కూరగాయలు, పండ్లు, చక్కెర, పాలు, పప్పుధాన్యాలు, మొబైల్స్, కరెన్సీ నోట్లు ఇలా ఇంటాబయటా...

కాన్పూర్, ఏప్రిల్ 27: ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ‘కరోనా కిల్లర్ బాక్స్’ను రూపొందించారు. వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పీపీఈ), మాస్క్‌లు, కూరగాయలు, పండ్లు, చక్కెర, పాలు, పప్పుధాన్యాలు, మొబైల్స్, కరెన్సీ నోట్లు ఇలా ఇంటాబయటా ఉపయోగించే అన్ని రకాల పదార్థాలను ఈ పెట్టె నిమిషాల్లో శానిటైజ్ చేయగలదు. ఈ బాక్స్‌లో 240 నుంచి 260 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యంతో అతినీలలోహిత కాంతులు ప్రసరితమై ఆయా వస్తువులు, పదార్థాలను క్రిమిరహితం చేస్తాయి. ఈ పెట్టె ధర ఇంచుమించు రూ.5 వేలు.