-
-
Home » Prathyekam » corona effect protect body healthy food
-
కరోనా ఎఫెక్ట్.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఇవే...!
ABN , First Publish Date - 2020-03-23T15:00:26+05:30 IST
వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతోనే ‘కరోనా’ వైరస్ అతివేగంగా ప్రబలుతుందంటూ వైద్యులు స్పష్టం చేశారు. ఈ శక్తిని పెంచే విధంగా ఆహార పదార్ధాలను ప్రజలు తీసుకోవాలని ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో వైద్యులు పేర్కొంటున్నారు.

చెన్నై : వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతోనే ‘కరోనా’ వైరస్ అతివేగంగా ప్రబలుతుందంటూ వైద్యులు స్పష్టం చేశారు. ఈ శక్తిని పెంచే విధంగా ఆహార పదార్ధాలను ప్రజలు తీసుకోవాలని ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో వైద్యులు పేర్కొంటున్నారు. నల్ల జీలకర్ర, బొప్పాయి, క్యారట్, తేనె, ఏలకులు, తాటి బెల్లం, నల్ల ద్రాక్ష, నక్షత్రపు సోంపు, ఉల్లి, వెల్లుల్లి, వేసవి సీజన్‌లో లభ్యమయ్యే కాయగూరలు, పండ్లను అధికంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రాబెర్రీ, పెద్ద ఉసిరి, జామ, ఆరంజ్, మునగాకు, గెనిసి గడ్డలు, తులసి ఆకు, ఆహార వంటల్లో రీఫైండ్ ఆయిల్ కన్నా కొబ్బరి నూనె వాడడం ఉత్తమం. ముఖ్యంగా, వెల్లుల్లిని పాలలో కలుసుకొని రాత్రి వేళల్లో తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.