క‌రోనాతో దంప‌తులు మృతి

ABN , First Publish Date - 2020-05-11T12:22:39+05:30 IST

ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప‌నిచేసే కాంట్రాక్ట్ టీచర్‌తో పాటు ఆమె భర్త కరోనా కారణంగా మృతిచెందారు. ఆ 45 ఏళ్ల ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. మ‌ర్నాడు...

క‌రోనాతో దంప‌తులు మృతి

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్  పాఠశాలలో ప‌నిచేసే కాంట్రాక్ట్ టీచర్‌తో పాటు ఆమె భర్త కరోనా కారణంగా మృతిచెందారు. ఆ 45 ఏళ్ల ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. మ‌ర్నాడు మృతి చెందింది. మృతురాలి కోవిడ్ -19 పరీక్ష రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా క‌రోనా బారిన‌ప‌డిన ఆమె భ‌ర్త కూడా మృతి చెందాడు. ఈ నేప‌ధ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ టీచర్స్ అసోసియేషన్‌ బాధిత కుటుంబానికి ఆప్ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌లు ప‌రిహారంగా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఎన్‌డిఎంసి అధికారి ఒకరు మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం రేషన్ పంపిణీ పథకం కోసం ఉపాధ్యాయులను నియమించింది. ఆ టీచ‌ర్‌ చివరిసారిగా ఏప్రిల్ 18 న విధుల‌కు  హాజ‌ర‌య్యారు. త‌రువాత ఆమె క‌రోనాతో మృతి చెందార‌ని తెలిపారు.  కాగా ఉపాధ్యాయురాలి మృతికి ఢిల్లీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-05-11T12:22:39+05:30 IST