సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ.. అందులో ఏం రాసుందో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-05-01T13:33:05+05:30 IST

రాజస్థాన్‌లో మద్యం దుకాణాలు తెరవాలని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు...

సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ.. అందులో ఏం రాసుందో తెలిస్తే..

కోట: రాజస్థాన్‌లో మద్యం దుకాణాలు తెరవాలని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్.. సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు. అక్రమ నాటుసారా విక్రయం పెరుగుతున్న నేపథ్యంలో మద్యం విక్రయాలకు అనుమతివ్వాలని ఎమ్మెల్యే లేఖలో కోరారు. మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచినట్టయిందని.. అక్రమంగా మద్యం విక్రయాలకు పరిస్థితి దారితీసిందని ఎమ్మెల్యే లేఖలో రాశారు. అయితే.. ఈ కారణాలతో పాటు ఎమ్మెల్యే భరత్ సింగ్ ఓ వింత వాదనను కూడా లేఖలో ప్రస్తావించారు.


ఆల్కహాల్‌తో చేతులు కడుక్కుంటే కరోనా వైరస్ అంతమవుతుందని చెబుతున్న నేపథ్యంలో.. మద్యం తాగడం వల్ల గొంతులో ఉన్న వైరస్‌ కూడా కచ్చితంగా అంతమవుతుందని ఎమ్మెల్యే లేఖలో రాయడం కొసమెరుపు. ఎమ్మెల్యే తీసుకొచ్చిన ఈ వాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



Updated Date - 2020-05-01T13:33:05+05:30 IST