స్మృతి చెప్పులపై యూజర్ కామెంట్.... కంగు తినిపించిన కేంద్రమంత్రి!

ABN , First Publish Date - 2020-12-10T17:32:37+05:30 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులు...

స్మృతి చెప్పులపై యూజర్ కామెంట్.... కంగు తినిపించిన కేంద్రమంత్రి!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతుంటారు. తాజాగా ఒక యూజర్ ఆమె ఫొటోపై కామెంట్ చేశారు. ఆ ఫొటోలో స్మృతి ఇరానీ తన ఇంటి గార్డెన్‌లో ల్యాప్ టాప్‌పై ఏదో పని చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకింద ఆమె పాండమిక్ మార్నింగ్ అని రాశారు.ఆ ఫోటోలో నీలి రంగు దుస్తులు ధరించిన ఆమె హవాయ్ చెప్పులు ధరించి కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ‘హవాయ్ చెప్పులు’ అని కామెంట్ చేశారు. దీనికి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ... అరె భాయ్... ఇవి రూ. 200 విలువ చేసే హవాయ్ చెప్పులు. బ్రాండ్ మాత్రం అడగకు... ఇది లోకల్’ అని రాశారు. దీనిని చూసిన యూజర్స్ ‘వోకల్ ఫర్ లోకల్’ అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-12-10T17:32:37+05:30 IST