నడిరోడ్డుపై పాము వర్సెస్ పిల్లి
ABN , First Publish Date - 2020-12-16T02:26:04+05:30 IST
నడిరోడ్డుపై పాము కనిపిస్తే ఎవరైనా సరే ముందుగా భయపడిపోతారు. ఆ తర్వాత పామును పట్టడానికి లేదా చంపడానికి సాహసం చేస్తారు. కానీ ఓ పిల్లి అలా చేయలేదు...
నడిరోడ్డుపై పాము కనిపిస్తే ఎవరైనా సరే ముందుగా భయపడిపోతారు. ఆ తర్వాత పామును పట్టడానికి లేదా చంపడానికి సాహసం చేస్తారు. కానీ ఓ పిల్లి అలా చేయలేదు. రోడ్డుపై పాకుతూ వస్తున్న పాము చుట్టూ తిరిగింది. దానితో కొట్లాడకుండా తెలివిగా వ్యవహరించింది. పాము దగ్గరకు వెళ్లకుండానే దాన్ని భయపెట్టింది. ఇంట్లోకి వెళ్ళాలనుకున్న పామును పిల్లి బెదరగొట్టింది. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.