కరోనా టెస్ట్ చేయించుకుని పెళ్లి పీటలెక్కాడు.. పెళ్లయ్యాక రిజల్ట్ పాజిటివ్ రావడంతో..

ABN , First Publish Date - 2020-06-18T21:24:22+05:30 IST

పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటే పోలీస్ కేసు ఏంటని...

కరోనా టెస్ట్ చేయించుకుని పెళ్లి పీటలెక్కాడు.. పెళ్లయ్యాక రిజల్ట్ పాజిటివ్ రావడంతో..

పాల్ఘర్: పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటే పోలీస్ కేసు ఏంటని ఆశ్చర్యపోకండి. పెళ్లి కొడుకు కరోనా టెస్ట్ చేయించుకుని రిజల్ట్ రాకముందే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతని పెళ్లికి వంద మందికి పైగా అతిథులు రావడం, కరోనా రిజల్ట్ రాకముందే పెళ్లి చేసుకోవడంతో ఆ యువకుడిపై కేసు నమోదైంది. వాదాలోని ఓ ల్యాబ్‌లో ఆ యువకుడు ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు.


లాక్ డౌన్ నిబంధనల ప్రకారం పెళ్లికి 50 మంది కంటే ఎక్కువ మంది హాజరుకావడానికి అనుమతి లేదు. జూన్ 11న జరిగిన ఈ 25 ఏళ్ల యువకుడి పెళ్లికి 100 మందికి పైగా హాజరయినట్లు పోలీసులు తేల్చారు. దీంతో.. సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ పెళ్లికి హాజయిన వారందరినీ క్వారంటైన్ కు తరలించి కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అలాంటి రాష్ట్రంలో.. లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా ఇలా పెళ్లిళ్లకు అతిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఆందోళన కలిగించే విషయం.

Updated Date - 2020-06-18T21:24:22+05:30 IST