అమ్మో.. రోజుకు ఇన్ని వేల ఆలోచనలు చేస్తామా..!

ABN , First Publish Date - 2020-07-19T01:50:23+05:30 IST

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తామో చెప్పగలరా..?...

అమ్మో.. రోజుకు ఇన్ని వేల ఆలోచనలు చేస్తామా..!

ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తామో చెప్పగలరా..? ఓ 100 లేదా 200 అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అవునండీ! రోజుకు సగటున మనం ఏకంగా 6వేలకు పైగా ఆలోచనలు చేస్తామట. ఈ విషయంపై అనేక ప్రయోగాలు చేసిమరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం మనిషి ఆలోచనా శక్తిపై అనేక పరిశోధనలు చేశారు. దీని ద్వారా సగటు మానవుడు ఒక  పూర్తి రోజుకు గానూ 6,200 ఆలోచనల చేస్తాడని తెలిపారు. దీనికోసం ఓ కొత్త పద్ధతిని వినియోగించినట్లు వారు వివరించారు. ఈ విధానం ద్వారా వ్యక్తి మెదడులో ఆలోచన మొదలు, అంతాలను లెక్కించామని తెలిపారు. వ్యక్తి ఆలోచన ఏదైనా విషయంపై కేంద్రీకృతమై ఉన్నప్పుడు, ఆ ఆలోచనలను వేరు వేరుగా లెక్కించడం ద్వారా ఈ గణాంకాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్లు తెలిపారు. ఈ పద్ధతికి ‘థాట్ వర్మ్’ ప్రాసెస్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

Updated Date - 2020-07-19T01:50:23+05:30 IST