రేపటి సూర్యగ్రహం మనం చూడగలమా..?
ABN , First Publish Date - 2020-12-13T19:02:14+05:30 IST
రేపు ఉదయం 7:03 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 గంటల వరకు సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపిస్తుందా..? ఒకవేళ కనిపిస్తే.. దానిని మనం చూడగలుగుతామా..? అనే ప్రశ్నలకు నిపుణులు అవుననే చెబుతున్నారు. ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా...

ఇంటర్నెట్ డెస్క్: రేపు ఉదయం 7:03 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 గంటల వరకు సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపిస్తుందా..? ఒకవేళ కనిపిస్తే.. దానిని మనం చూడగలుగుతామా..? అనే ప్రశ్నలకు నిపుణులు అవుననే చెబుతున్నారు. ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా దక్షిణమెరికాలోని చీలి, అర్జెంటీనా దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో కూడా పాక్షికంగా గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రహణం వల్ల అనేక దేశాల్లో చీకట్లు కమ్ముకోబోతున్నాయి. రేపటి సూర్యగ్రహణం మొత్తం 5 గంటలపాటు కొనసాగుతుందని, ఇండియాతో సహా అనేక దేశాల్లో రేపు పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుందనేది నిపుణుల మాట.
ఈ గ్రహణం వల్ల ఇండియాలో చీకట్లు కమ్ముకోవు కానీ, సూర్యుడిపై చంద్రుని నీడను మాత్రం స్పష్టంగా మనం చూడవచ్చట. అంతేకాదు ఫిల్మ్ వంటి వాటిని ఉపయోగించి ఈ గ్రహణాన్ని మనం చూడవచ్చట కూడా. ఇదిలా ఉంటే రేపు ఏర్పడే సూర్యగ్రహణం ఈ ఏడాదికి ఆఖరి సూర్యగ్రహణం. దీంతో ఈ గ్రహణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా దీనిని చూడాలని ఔత్సాహికులు అనుకుంటున్నారు. మరి మీరూ రెడీగా ఉండండి.
