మన టపాసులే ముద్దు.. చైనావి వద్దు.. నెట్టింట్లో ట్రెండింగ్

ABN , First Publish Date - 2020-11-08T00:15:20+05:30 IST

దీపావళి సందర్బంగా ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశీ వస్తువులను, ముఖ్యంగా చైనాకు చెందిన బొమ్మలు, టపాసులు వంటి వాటిని కొనుగోలు చేయవద్దంటూ...

మన టపాసులే ముద్దు.. చైనావి వద్దు.. నెట్టింట్లో ట్రెండింగ్

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్బంగా ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశీ వస్తువులను, ముఖ్యంగా చైనాకు చెందిన బొమ్మలు, టపాసులు వంటి వాటిని కొనుగోలు చేయవద్దంటూ నెటిజన్లు పిలుపునిస్తున్నారు. కరోనా వల్ల దేశంలో ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారిలో అనేకమంది ఇప్పుడు దీపావళి సామగ్రిని విక్రయిస్తూ పొట్టపోసుకోవాలని అనుకుంటున్నారని, వారి వద్ద మాత్రమే పండుగ సామగ్రిని కొని చేయూత ఇవ్వాలని కోరుతున్నారు. చైనా ప్రోడక్టులను కొనడం వల్ల ఎంతో దేశానికే కాకుండా, ఎంతో మంది పేదలకు కూడా అన్యాయం చేసిన వాళ్లమవుతామంటూ సోషల్ మీడియాలో అనేక ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగానే हिन्दू_दीपावली_हिन्दू_सामान(హిందూ దీపావళి.. హిందూ సామాన్) అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై లక్షన్నరకు పైగా ట్వీట్లు పోస్టయ్యాయి.

Updated Date - 2020-11-08T00:15:20+05:30 IST