కరోనా కష్టకాలంలో.. అపరిచితుల రుణాలు తీర్చిన వ్యాపారవేత్త!

ABN , First Publish Date - 2020-05-18T03:21:23+05:30 IST

ప్రస్తుత కరోనా కష్టకాలంలో రుణాలు చెల్లించడం ఎవరికైనా కష్టమే.

కరోనా కష్టకాలంలో.. అపరిచితుల రుణాలు తీర్చిన వ్యాపారవేత్త!

ఐజ్వాల్: ప్రస్తుత కరోనా కష్టకాలంలో రుణాలు చెల్లించడం ఎవరికైనా కష్టమే. వ్యాపారాలు, పనులు లేక సామాన్యలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో మిజోరాంకు చెందిన ఓ వ్యాపారవేత్త తన దయాగుణం చాటుకున్నాడు. ఐజ్వాల్‌లోని ఓ బ్యాంకులో ఖాతాలున్న నలుగురు వ్యక్తుల రుణాలను పూర్తిగా చెల్లించాడు. మొత్తం ఈ నలుగురికి రూ.10లక్షలపైగా  రుణాలు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురికి తానెవరో కూడా చెప్పలేదు. వారిని కలవడానికి బ్యాంకు వద్దకు రావడానికి కూడా నిరాకరించాడు. దీనిపై ఈ నలుగురిలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఓ రోజు బ్యాంకు నుంచి నాకు కాల్ వచ్చింది. ఇలా ఓ బిజినెస్‌మేన్ నలుగురి రుణాలు చెల్లిస్తున్నారని, వారిలో తన పేరును కూడా బ్యాంకు అధికారులు ఎంపిక చేశారని చెప్పారు. ఆ తర్వాత సదరు దాత నా రుణం పూర్తిగా చెల్లించేశారన్నారు’ అని తెలిపారు.

Updated Date - 2020-05-18T03:21:23+05:30 IST