ఆరు గజాల్లో మూడంతస్తుల ఇల్లు... కూల్చివేయనున్న అధికారులు

ABN , First Publish Date - 2020-11-25T17:51:57+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని బురాడీలో ఆరు గజాల స్థలంలో నిర్మించిన మూడు అంతస్థుల ఇంటిని...

ఆరు గజాల్లో మూడంతస్తుల ఇల్లు... కూల్చివేయనున్న అధికారులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని బురాడీలో ఆరు గజాల స్థలంలో నిర్మించిన మూడు మూడంతస్తుల ఇంటిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం తరలివస్తుంటారు. ఆరు గజాల అతిచిన్న స్థలంలో ఇంటిని ఎలా కట్టారో చూడాలని చాలామంది తపనపడిపోతుంటారు. అయితే త్వరలో ఆ ఇల్లు కనుమరుగుకానుంది. ఇకపై ఇటువంటి చిన్న ఇంటిని నిర్మించిన ప్లానర్‌ను అభినందించడం తప్ప మరేంచేయలేం.


భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, నిర్మించిన ఈ ఇంటిని కూలగొట్టాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఇల్లు... చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారుతున్న నేపధ్యంలో కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీడీకి చెందిన ఇంజినీరు ఒకరు మాట్లాడుతూ కొన్ని వార్తల ద్వారా తాము ఆ ఇంటి గురించి తెలుసుకున్నామని, నియమ, నిబంధనలను ఉల్లంఘించి దానిని నిర్మించారన్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం 32 చదరపు అడుగుల స్థలం అవసరముంటుందని అన్నారు. అయితే ఈ ఇంటిని అక్రమంగా కేవలం ఆరు అడుగుల స్థలంలో నిర్మించారని అన్నారు. ఇటువంటి ఇళ్లకు ఎప్పటికీ అనుమతి లభించదని పేర్కొన్నారు. ఈ ఇంటి గురించి చాలామంది తమకు ఫిర్యాదు చేశారని, దీనిని త్వరలోనే కూలగొట్టనున్నామని తెలిపారు.

Updated Date - 2020-11-25T17:51:57+05:30 IST