షాకింగ్: పెళ్లి వేదిక వద్దే వధూవరుల అరెస్టు! 50 మంతి అతిథులను కూడా..

ABN , First Publish Date - 2020-04-08T21:05:57+05:30 IST

లాక్ డౌన్‌లో పెళ్లి చేసుకున్న వధూవరుల అరెస్టు

షాకింగ్: పెళ్లి వేదిక వద్దే వధూవరుల అరెస్టు! 50 మంతి అతిథులను కూడా..

కేప్‌టౌన్: వధూవరులిద్దరూ జస్ట్ అప్పుడే ఉంగరాలు మార్చుకుని వివాహబంధానికి నాంది పలికారు. దీంతో వివాహ వేడుకకు వచ్చిన బంధువులు, స్నేహితుల చపట్లతో ఆ వేదిక మారుమోగిపోయింది. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతలో ఊహించని షాక్. పెద్ద సంఖ్యలో పోలీసులు ఒక్కసారిగా వేదిక వద్దకు వచ్చారు. ఇదంతా చూస్తున్న వారి నోటమాట పడిపోయింది. అయితే కొంత మందికి మాత్రం విషయం మెల్లగా అర్థమవసాగింది. ఈలోపే పోలీసులు.. వధూవరులతో సహా అక్కడున్న వారందరినీ అరెస్టు చేసే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అచ్చు తెలుగు సినిమాలో సీన్ లాగా ఉన్న ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలో జరిగింది.


అందరినీ అరెస్టు చేయమేంటి? అసలు ఏం జరిగిందీ? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. వరుడు జబులానీ జూలూ, వధువు నోమ్తాన్‌డాజో కిజీ.. ఆదివారం నాడు పెళ్లి చేసుకున్నారు. రిచర్డ్ బే ప్రాంతంలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 50 మంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఈ జంట పెళ్లికి సిద్ధపడింది.ఈ ప్రేమ పక్షుల సంగతి సరేగానీ.. అథితులు కూడా నిబంధనలు పక్కన పెట్టి రిస్క్ తీసుకున్నారు. దీంతో అసలుకే ఎసరోచ్చింది. అక్కడ జరుగుతున్న తతంగం గురించి  పోలీసులకు ఉప్పందటంతో పెళ్లి వేడుకలో పాల్గొన్న వారందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సోచ్చింది. అఫ్ కోర్స్.. ఆ తరువాత బెయిలుపై వారిని విడిపెట్టారనుకోండి. ఇక వీరిపై సోమవారం కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. దక్షిణాఫ్రికాలో మొత్తం 1700 కరోనా కేసులు నమోదవగా ఏప్రిల్ 16 వరకూ దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

Updated Date - 2020-04-08T21:05:57+05:30 IST