యువకుని సాహసం... నాలుగు లక్షలు స్వాధీనం!

ABN , First Publish Date - 2020-10-14T12:24:06+05:30 IST

యువకుని సాహసం... నాలుగు లక్షలు స్వాధీనం!

యువకుని సాహసం... నాలుగు లక్షలు స్వాధీనం!

మహరాజ్‌గంజ్: యూపీలోని మహరాజ్‌గంజ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పర్తావల్ ప్రధాన కూడలి వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆలూ వ్యాపారి వద్ద పనిచేసే వ్యక్తి నుంచి డబ్బుతో నిండిన బ్యాగ్‌ను లాక్కుపోయారు. దీంతో ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో చౌరస్తా వద్ద నున్న ఒక యువకుడు వారిని వెంబడించి పనియరా రోడ్డు వద్ద పట్టుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే సుమేర్‌గఢ్ నివాసి రామ్‌భోజ్ భారతి గోరఖ్‌పూర్ గోరఖ్‌పూర్‌లో ఒక ఆలూ వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో గోరఖ్ పూర్ నుంచి ఒక ట్రక్కు ఆలూ తీసుకుని బీహార్‌లోని హర్నాటర్‌కు వాటిని విక్రయించేందుకు తీసుకువెళ్లాడు. వాటిని విక్రయించగా వచ్చిన సుమారు నాలుగు లక్షల రూపాయలను బ్యాగులో పెట్టుకుని, కప్తాన్‌గంజ్ నుంచి  పర్తావల్ చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతని నుంచి క్యాష్ బ్యాగ్ లాక్కొని పారిపోయారు. దీంతో రామ్‌భోజ్ భారతి గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడే ఉన్న ఒక యువకుడు ఆ దొంగలను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

Updated Date - 2020-10-14T12:24:06+05:30 IST