కరోనా రోగుల్లో గడ్డ కడుతున్న రక్తం

ABN , First Publish Date - 2020-05-17T08:16:08+05:30 IST

తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ బారినపడిన కరోనా రోగుల సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తవచ్చని అమెరికాలోని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.

కరోనా రోగుల్లో గడ్డ కడుతున్న రక్తం

న్యూయార్క్‌, మే 16 : తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ బారినపడిన కరోనా రోగుల సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తవచ్చని అమెరికాలోని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. త్రాంబోఎలాస్టోగ్రఫీ(టీఈజీ) చేయించుకోవడం ద్వారా ఆ ముప్పు ముదరక ముందే గుర్తించవచ్చని సూచించారు. రోగికి ముందస్తు స్ర్కీనింగ్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా సర్జన్లు, అనస్తీషియాలజిస్టులు వినియోగించే టీఈజీ స్ర్కీనింగ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే సమస్యలు గుర్తించేందుకు వాడాల్సిన అవసరం ఉందన్నారు.   

Updated Date - 2020-05-17T08:16:08+05:30 IST