అల్పాహారానికి డుమ్మా కొడితే అంతే..

ABN , First Publish Date - 2020-03-02T07:51:16+05:30 IST

శరీర బరువును తగ్గించుకునేందుకు ఎంతోమంది మితాహారం తీసుకుంటుంటారు. అయితే తెలిసో తెలియకో...

అల్పాహారానికి డుమ్మా కొడితే అంతే..

రాత్రి స్నాక్స్‌ తిన్నా కొవ్వు కరగదు!!

వాషింగ్టన్‌, మార్చి 1 : శరీర బరువును తగ్గించుకునేందుకు ఎంతోమంది మితాహారం తీసుకుంటుంటారు. అయితే తెలిసో తెలియకో కొందరు అల్పాహారం తినడం మానేస్తుంటారు. ఇంకొందరు రాత్రి భోజనానికి అదనంగా స్నాక్స్‌ కూడా తినేస్తుంటారు. ఈ రెండు అలవాట్ల కారణంగా శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అమెరికాలోని వ్యాండర్‌బిల్ట్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా డైటింగ్‌ చేసేవారు ఆశించిన విధంగా శరీర బరువు తగ్గడం లేదని పేర్కొన్నారు. జీవ గడియారానికి అనుగుణంగా నడుచుకుంటూ.. కంటినిండా నిద్రిస్తూ, సకాలంలో భోజనం, వ్యాయామాలు చేస్తే శరీర బరువు అదుపులో ఉంటుందన్నారు.

Updated Date - 2020-03-02T07:51:16+05:30 IST