కరోనాపై అవగాహన కల్పించేలా ‘బీ రెస్పాన్స్‌బుల్’ వీడియో

ABN , First Publish Date - 2020-04-14T19:12:50+05:30 IST

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయం గుప్పిట్లో ఉంది. ఎన్నో లక్షల ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా అమెరికా విలవిలలాడుతోంది. ఇలాంటి పరిస్థితులలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు, సినీ తారలు, క్రీడా కారులు వారి వారి వీడియో సందేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనాపై అవగాహన కల్పించేలా ‘బీ రెస్పాన్స్‌బుల్’ వీడియో

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయం గుప్పిట్లో ఉంది. ఎన్నో లక్షల ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా అమెరికా విలవిలలాడుతోంది. ఇలాంటి పరిస్థితులలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు, సినీ తారలు, క్రీడా కారులు వారి వారి వీడియో సందేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

అందులో భాగంగా, అమెరికాలో ఉంటున్న వర్ధమాన గాయకుడు తెలుగు ఎన్ఆర్ఐ కార్తీక్ జయంతి తాజాగా కరోనా వైరస్‌పై చేసిన ‘బీ రెస్పాన్స్‌బుల్’ అనే వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రాధా జయంతి నిర్మించిన ఈ వీడియోలో ప్రముఖ గాయకులు శ్రీకృష్ణ, ధనుంజయ్, రోహిత్, సంధ్యాబాయి రెడ్డి, శ్రీకాంత్ సందుగు, సాహిత్య వింజమూరి, కార్తీక్ కొడకండ్ల, స్వాతి శర్మ, చైతన్య సాయిరాం, పిలుపు టీవీ ప్రతినిధులతో పాటు అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థల వారు సందేశాన్ని అందించారు. Updated Date - 2020-04-14T19:12:50+05:30 IST