ఆ గ్రామంలో 28 మందే..8 ఏళ్ల తరువాత శిశుజననం..పండగే పండగ!

ABN , First Publish Date - 2020-07-22T15:26:53+05:30 IST

ఇటలీ దేశం మొత్తంలో అతి చిన్న గ్రామం అదే. పేరు మార్టిరోనీ..జనాభా జస్ట్ 29. అవును ఆ గ్రామంలో నివసించేది కేవలం 28 మంది.

ఆ గ్రామంలో 28 మందే..8 ఏళ్ల తరువాత శిశుజననం..పండగే పండగ!

ప్యారిస్: ఇటలీ దేశం మొత్తంలో అతి చిన్న గ్రామం అదే. పేరు మార్టిరోనీ..ఇప్పటిదాకా అక్కడ జనాభా జస్ట్ 28. అవును ఆ గ్రామంలో నివసించేది కేవలం 28 మంది. అయితే. .దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ గ్రామంలో ఓ అద్భుతం జరిగింది. అక్కడి ఓ బుజ్జి పాపాయి జన్మించిడంతో అక్కడ సంబరాలు మిన్నంటాయి. ఈ బుజ్జాయి పేరు డెన్నిస్. తండ్రి పేరు మటాయో.. తల్లి పేరు శారా. తమకు మగబిడ్డ పుట్టాడని, గ్రామంలో కొత్త సభ్యుడు వచ్చాడని చెప్పేందుకు వారు తమ ఇంటి తలుపుకు ఓ నీలి రంగు రిబ్బన్ తగిలించారు. అలా చేయడం ఇటీలీలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అబ్బాయి పుడితే నీలి రిబ్బన్.. అమ్మాయి పుడితే లేత గులాబీ రంగు రిబ్బన్‌ను తలుపుకు తగిలిస్తారు.


ఇక లాక్ డౌన్ల సమయంలో కడుపుతూ ఉండటం తనను కంగారు పెట్టిందని తల్లి శారా చెప్పింది. ఇక కొత్త సభ్యుడి రాకతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఆ గ్రామంలో మరణం సంభవించడంతో అక్కడ జనాభా సంఖ్య 28 పడిపోయింది. కానీ తాజాగా డెన్నిస్ రాకతో మొత్తం సభ్యుల సంఖ్య మునుపటి స్థితికి చేరుకుందని గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. ఆ బుజ్జాయి నవ్వులతో మార్టిరోనీ కొంగొత్త కళను సంతరించుకుంది. 


Updated Date - 2020-07-22T15:26:53+05:30 IST