-
-
Home » Prathyekam » auto driver uses money saved for wedding to feedmigrants
-
పెళ్లి కోసం దాచిన సొమ్ముతో... ఆటోవాలా ఔదార్యం!
ABN , First Publish Date - 2020-05-18T17:35:01+05:30 IST
కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పలువురు తమలోని మానవత్వాన్ని వెలికితీస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో 30 ఏళ్ల ఆటో డ్రైవర్ అక్షయ్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయలు దాచుకున్నాడు.

పూణే: కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పలువురు తమలోని మానవత్వాన్ని వెలికితీస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో 30 ఏళ్ల ఆటో డ్రైవర్ అక్షయ్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయలు దాచుకున్నాడు. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అతని వివాహం వాయిదా పడింది. దీంతో ఈ మొత్తాన్ని వలస కూలీలు, నిస్సహాయులకు ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేప్రయత్నం చేస్తున్నాడు. తన స్నేహితుల సహాయంతో ప్రతిరోజూ 400 మందికి అక్షయ్ ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ తాను ఆటో నడుపుతున్నప్పుడు రూ .2 లక్షలు జమ చేశానని తెలిపాడు. తనకు మే 25న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ కారణంగా వివాహం వాయిదా వేసుకున్నామన్నారు. పూణేలోని టింబర్ మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న అక్షయ్ లాక్‌డౌన్‌లో పేదల అవస్థలు చూసి, వారికి సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.