వార్నింగ్ ఇచ్చాడని బైకర్‌‌ను ఆటోతో గుద్దిన డ్రైవర్.. నెట్టింట వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-12-25T21:16:58+05:30 IST

ముంబైలోని గోవండి ఏరియాలో జరిగిన ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ర్యాష్‌గా వాహనం నడిపిన ఓ ఆటో డ్రైవర్‌ను బైకర్ మందలించినందుకు ఏకంగా అతడిని పైలోకానికే పంపేయబోయాడా ఆటో డ్రైవర్. అయితే హెల్మెట్ ఉండడంతో ప్రమాదంలో...

వార్నింగ్ ఇచ్చాడని బైకర్‌‌ను ఆటోతో గుద్దిన డ్రైవర్.. నెట్టింట వీడియో వైరల్!

ముంబై: ముంబైలోని గోవండి ఏరియాలో జరిగిన ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ర్యాష్‌గా వాహనం నడిపిన ఓ ఆటో డ్రైవర్‌ను బైకర్ మందలించినందుకు ఏకంగా అతడిని పైలోకానికే పంపేయబోయాడా ఆటో డ్రైవర్. అయితే హెల్మెట్ ఉండడంతో ప్రమాదంలో బైకర్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించి బైకర్ ఇచ్చిన కంప్లైంట్‌కు తోడు.. వీజువల్స్ మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలలో రికార్డు కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 17న గోవండి ఏరియాలో సయ్యద్‌ సల్మాన్‌ అనే ఆటో డ్రైవర్‌ ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడమే కార్తిక్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బైక్‌పై వెళ్తున్న కార్తిక్‌ అనే వ్యక్తికి తన ఆటోతో కావాలనే సయ్యద్ డాష్‌ ఇచ్చాడు. అయినా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయిన సయ్యద్‌ను సిగ్నల్‌ వద్ద పట్టుకున్న కార్తిక్‌ అతడిని మందలించాడు. 


ఇంత ర్యాష్‌గా నడిపితే ఎలా.. రోడ్డు మీద చూసుకొని వెళితే బాగుంటుదని చెప్పాడు. దీంతో సయ్యద్‌‌కు కోపం వచ్చింది. సిగ్నల్‌ రిలీజైన తర్వాత కార్తిక్‌ బైక్‌ను మరోసారి తోసుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదాన్ని ఊహించని కార్తిక్ బైక్ బ్యాలెన్స్ తప్పి రోడ్డుపైనే కిందపడిపోయాడు. హెల్మెట్‌ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నెంబర్‌ ప్లేట్‌ను గుర్తించి సయ్యద్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్‌గా డ్రైవింగ్‌ చేయడమే గాక హత్యకు యత్నించిన సయ్యద్‌పై సెక్షన్‌ 307, 279 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.Updated Date - 2020-12-25T21:16:58+05:30 IST