మొబైల్ వాడకం బట్టి.. మానసిక పరిస్థితి చెప్పే యాప్!
ABN , First Publish Date - 2020-07-20T03:00:24+05:30 IST
ప్రస్తుత మోడ్రన్ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ వాడుతూనే ఉన్నారు.

డల్‌హౌసీ: ప్రస్తుత మోడ్రన్ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ వాడుతూనే ఉన్నారు. అందుకే దీన్ని ఆసరాగా చేసుకొని సదరు వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉందా? అని ఆలోచించారు హిమాచల్ ప్రదేశ్‌లోని డల్‌హౌసీకి చెందిన పరిశోధకులు. అనుకున్నదే తడవుగా దీనికోసం ‘ప్రాసిట్’ అనే యాప్‌ను సృష్టించారు. దీంతో మనం మొబైల్ వాడే సమయాన్ని బట్టి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చట. ఎక్సర్‌సైజ్, నిద్ర, కాల్స్, మెసేజ్ హిస్టరీ తదితర అంశాలను పరిశీలించడం ద్వారా మన మానసిక పరిస్థితిపై ఈ యాప్ ఓ అంచనాకు వస్తుందని దీని సృష్టికర్తలు చెప్తున్నారు.