భయాన్ని పోగొట్టే యాంటీ కరోనా మిఠాయి!

ABN , First Publish Date - 2020-04-07T18:31:44+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తోంది. ఈ వైరస్ పై అవగాహన కలిగించడానికి ఒక వ్యక్తి యాంటీ కరోనా స్వీట్ సిద్ధం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌కు చెందిన ....

భయాన్ని పోగొట్టే యాంటీ కరోనా మిఠాయి!

కోల్ కతా : కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తోంది. ఈ వైరస్ పై అవగాహన కలిగించడానికి ఒక వ్యక్తి యాంటీ కరోనా స్వీట్ సిద్ధం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌కు చెందిన హిందుస్థాన్ స్వీట్స్ లో ఈ మిఠాయిలు తయారవుతున్నాయి. ఈ స్వీటును కరోనా వైరస్ జీవి ఆకారంలో తయారు చేశారు. హిందుస్థాన్ స్వీట్స్ యజమాని రవీంద్ర కుమార్ పాల్ ఈ స్వీట్ గురించి మాట్లాడుతూ తాము యాంటీ కరోనా స్వీట్  తయారు చేశామని,. కరోనావైరస్ గురించి అందరికీ అవగాహన కలిగించడానికే వీటికి రూపకల్పన చేశామన్నారు. దీని ద్వారా... కరోనాకు భయపడమని, దానిని జీర్ణం చేసుకుంటామని అందరికీ చెప్పాలనుకుంటున్నామని అన్నారు. 

  .

 

Read more